లాక్ డౌన్ తో వలస కూలీల బ్రతుకులు చిద్రమైపోతున్నాయి. రైళ్లు కింద…బస్సులు కింద..ట్రక్కుల కింద…ట్రాక్టర్ల కింద పడి రోజూ మరణ మరణ వార్త వినాల్సిందే. రైలు పట్టాలు మీదు పడుకున్న ఓ గూడ్స్ రైలు 14 మంది కూలీలను పొట్టనబెట్టుకుంది. ఆ ఘటన మరువక ముందే ఏపీలోని ప్రకాశం జిల్లాలో పదుల సంఖ్యలో కార్మికులు విద్యుత్ షాక్ గురై మరణించారు. వీరంతా ట్రాక్టర్ పై పనికి వెళ్తోన్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి కరెంట్ స్థంబాన్ని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఆ ఘటనలు మరువకే ముందే ఉత్తప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలతో రాజాస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వెళ్తోన్న ఓ ట్రక్కు ను మరో ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో 23 మంది వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఔరియా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వీరంతా ఉత్తర ప్రదేశ్ వాసులుగా పోలుసులు గుర్తించే కేసు నమోదు చేసి..దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తో దేశమంతా ఉలిక్కి పడింది. వరుస ప్రమాదాలు కూలీలకు కంటి మీద కునుక లేకుండా చేస్తున్నాయి. బ్రతుకు జీవుడా అంటూ పొట్ట చేత పటి కుటుంబాలకి ఎక్కడో దూరంగా పనిచేస్తూ…చివరికి గమ్యం మధ్యలోనే అసువులు బాసుతున్నారు.
కరోనా వైరస్ చావులకన్నా…యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లుంది. మరి ఈ ప్రమాదాలకి ప్రభుత్వం ఎలాంటి బధులిస్తుంది? తగినన్ని శ్రామిక్ రైళ్లను నడిపితే ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క జాతీయ రహదారుల వెంబడి వలస కూలీలు నానా అవస్థలు పడి నడుస్తున్నా..కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు వైరస్ పేరు చెప్పి నిమ్మకు నీరెత్తనట్లే వ్యవరిస్తోంది. లాక్ డౌన్ పేరుతో ప్రభుత్వమే జనాల్ని చంపేస్తుందన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.