ఇండియన్ బ్యాంక్‌‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. వేతనం ఎంతంటే?

ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు వేగంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్ ఆఫ్ అలహాబాద్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఫైనాన్సియల్ లిటరసీ కౌన్సెలర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఒకే ఒక్క ఉద్యోగం కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.

 

ఎవరైతే ఈ ఉద్యోగానికి ఎంపికవుతారో వాళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి యూపీలోని లఖింపూర్ ఖేరీలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 68 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కమర్షియల్ బ్యాంక్ లలో పని చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

రూరల్ బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండటంతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ వెబ్ సైట్ నుంచి ఈ ఉద్యోగ ఖాళీకి సంబంధించిన దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. టూ ద జోనల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్, జోనల్ ఆఫీసర్, లఖింపూర్ ఖేరీ రాధే కాంప్లెక్స్, కుట్చెరి రోడ్, లఖింపూర్ ఖేరీ 262701, యూపీ అడ్రస్ కు దరఖాస్తును పంపాల్సి ఉంటుంది.

 

మే నెల 18వ తేదీ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి 15,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఐదో నెల నుంచి అలవెన్స్ లను పొందే అవకాశం ఉంటుంది.