చిన్న సినిమా ఫ్రీ షో కి భారీగా తరలిన మహిళలు.?

టాలీవుడ్ లో ఓ సినిమాని ప్రేక్షకులకి చేరాలి అంటే అది సరైన ప్రమోషన్స్ వల్లే సాధ్యం అవుతుంది. అయితే ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ అందులో ఎలాంటి హీరో ఉన్నప్పటికీ పలు సినిమాలు అయితే సరైన ప్రమోషన్స్ లేనిదే చాలా చిత్రాలు అయితే చాలా వసూళ్లు లాస్ అయ్యాయి.

అయితే కొన్ని చిన్న సినిమాలు అయితే సరైన ప్రమోషన్స్ గాని చేస్తే ఎలాంటి వసూళ్లు రాబడతాయో లేటెస్ట్ గా చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ ని రేపుతున్న “రైటర్ పద్మభూషణ్” సినిమా నిరూపించింది. మొదటి రోజు నుంచే మంచి టాక్ ని తెచ్చకున్న ఈ చిత్రం నెక్స్ట్ ఆడియెన్స్ అటెన్షన్ ని అందుకోడానికి ముఖ్యంగా..

మహిళల మెప్పు కోసం ఈ సినిమా యూనిట్ వేసిన ఇంట్రెస్టింగ్ స్టెప్ వారికి పెద్ద ఎత్తున పాజిటివ్ గా మారబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ టాక్. మరి ఈ సినిమాని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో మహిళలకి ఫ్రీ గా షో లు వేశారు. మొత్తం నాలుగు ఆటలు కూడా మహిళా ప్రపంచానికి ఫ్రీ షో తో తెచ్చిన ఈ కాన్సెప్ట్ సూపర్ హిట్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

ఆల్రెడీ సినిమా థియేటర్స్ కి వారు క్యూ కడుతూ ఉండగా టోటల్ తెలుగు రాష్ట్రాల్లో 38 థియేటర్స్ లో అయితే ఏకంగా 70 వేలకి పైగా మహిళలు సినిమా చూడనున్నారని నిర్మాతలు చెప్తున్నారు. మరి ఈ చిన్న సినిమా పెద్ద ప్రయత్నం అయితే బాగానే వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పాలి. వసూళ్లు మాత్రం నెక్స్ట్ నుంచి ఎలా ఉంటాయో చూడాలి.