శ్రీ కార్తిక్ దశకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మదర్ సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు రావడంతో మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇలా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకి డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకు ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా మొదటినుంచి డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు అమ్మారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సమస్థ సోనీ లైవ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా అబో హిట్ టాక్ సొంతం చేసుకుంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం 11 కోట్లు చెల్లిస్తామని యావరేజ్ హిట్ సొంతం చేసుకుంటే ఎనిమిది కోట్లు చెల్లిస్తామని సోనీ లైవ్ మేకర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
ఇలా ఈ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్ రావడంతో మేకర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా ఇక రేపు ఎల్లుండి సెలవు దినాలు కావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా మంచి వసూళ్లను సంపాదిస్తుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అమల మదర్ క్యారెక్టర్ లో నటించి తన సెంటిమెంట్ బాగా పండించారని చెప్పాలి. చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి శర్వా ఈ సినిమాతో హిట్ కొట్టారని చెప్పవచ్చు.