జగపతిబాబుని నమ్మి మోసపోయా.. సంచలన వ్యాఖ్యలు చేసిన అలనాటి హీరో వేణు తొట్టెంపూడి…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వయంవరం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వేణు మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషి గా, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే వంటి మల్టీ స్టార్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత వేణు నటించిన సినిమాలు అంతగా హిట్ కాకపోవటంతో ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గాయి. దీంతో వేణు చెన్నైలో బిజినెస్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు తొట్టెంపూడి ఇటీవల రవితేజ హీరోగా నటించిన రామారావు అండ్ డ్యూటీ అనే సినిమాలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమాలో వేణు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అవటంతో వేణుకి ఇతర సినిమాలలో నటించే అవకాశాలు రాలేదు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వేణు ఇటీవల మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో అలనాటి హీరో జగపతిబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జగపతిబాబు గురించి వేణు తొట్టెంపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు జగపతిబాబు గురించి మాట్లాడుతూ.. గతంలో ఇద్దరం చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం. కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య మాటలు లేవు. ఎందుకంటే గతంలో జగపతిబాబు పూచికత్తు మీద ఒకరికి 16 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను. ఎంతకాలం గడిచినా కూడా వారు అప్పు తిరిగి చెల్లించలేదు. కేవలం జగపతిబాబు ఫోన్ చేసి చెప్పాడు అన్న కారణంతోనే వారికి అప్పు ఇచ్చాను. అయితే నేను అలా డబ్బులు ఇచ్చిన తర్వాత జగపతిబాబు వాటి గురించి కనుక్కోవడానికి మరి ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేయలేదు. నా దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తి కూడా ఒక్క రూపాయి తిరిగి చెల్లించలేదు. జగపతిబాబు కారణంగా నేను అప్పట్లోనే 16 లక్షలు నష్టపోయాను అంటూ జగపతి బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.