విజయ్ దేవరకొండ సినిమాలు ప్లాప్ కావటానికి అతని జాతకమే కారణం.. వేణు స్వామి!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న విజయ్ పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారాడు. ఈ సినిమా హిట్ అవ్వటంతో తెలుగులో వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో విజయ్ నటించిన గీతగోవిందం , అర్జున్ రెడ్డి సినిమాలు వరుసగా హిట్ అవటంతో యువతలో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత విజయ నటించిన టాక్సీవాలా, డియర్ కామ్రేడ్స్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు బ్లాక్ అయ్యాయి.

ఇక పూరి జగన్నాథ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో దొరికేక్కిన లైగర్ సినిమా కూడా ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బిజీ అకౌంట్ లో మరొక ప్లాప్ వచ్చి పడింది. అయితే నిత్యం సెలబ్రిటీల భవిష్యత్తు గురించి జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసే వేణు స్వామి ఇటీవల విజయ్ జాతకం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో వేణు స్వామి మాట్లాడుతూ ప్రస్తుతం విజయ్ జాతకంలో అష్టమి దశ శని ప్రారంభమైందని..దీని ప్రభావం చాలా కాలం ఉంటుందని వెల్లడించాడు. అందువల్ల విజయ్ నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయని వెల్లడించాడు.

విజయ్ దేవరకొండ జాతకం ప్రకారం ఇతను ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా గుర్తింపు పొందే అవకాశాలు లేవని, భవిష్యత్తులో కూడా విజయ్ నటించిన కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వేణు స్వామి ఇలా విజయ్ భవిష్యత్తు గురించి సంచలనం వ్యాఖ్యలు చేయడంతో అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి కొంతమంది మాత్రం వేణు స్వామి చెప్పే జాతకంలో నిజాలు లేవని కొట్టిపారేస్తున్నారు.
[4:14 PM, 9/19/2022] +91 95420 55509: 37