ఈ శ్రావణ మాసం ముగింపు అత్యంత ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. ఆగస్టు 23వ తేదీ శనివారం అమావాస్య తిథి జరగనుంది. అయితే ఈ అమావాస్య సాధారణం కాదు. 64 ఏళ్ల తర్వాత అతి అరుదైన గజకేసరి రాజయోగం శనివారం రోజున, ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడనుంది. జ్యోతిష్య పండితులు చెబుతున్నట్లు, అమావాస్య, శనివారం, ఆశ్లేష నక్షత్రం కలిసే ఈ సంయోగం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. భాద్రపద మాసానికి ఆరంభం కావడానికి ముందురోజే ఈ ప్రత్యేక యోగం ఏర్పడటం మరింత ప్రాముఖ్యతను కలిగిస్తోంది.
సాధారణంగా చాలామంది అమావాస్యను అననుకూలమని భావిస్తారు. కానీ జ్యోతిష పండితుల అభిప్రాయం ప్రకారం, ఈసారి అమావాస్య దినం భవిష్యత్తులో గొప్ప మార్పులకు దారితీయనుంది. గజకేసరి రాజయోగం ఏర్పడటం వల్ల అనేక రాశుల వారికి ధనం, ధాన్యం, గౌరవం, అదృష్టం అనూహ్యంగా కలిసివస్తాయి. జీవితంలో ముందడుగు వేసే అవకాశాలు లభిస్తాయి.
ఈ అరుదైన యోగం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభించవచ్చు. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్యావకాశాలు తెరుచుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అప్పులు తీరిపోతాయి. చాలాకాలంగా రాని డబ్బు అనుకోకుండా దక్కుతుంది. సోదరులతో ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. భార్య తరపు ఆస్తులు సొంతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో లాభదాయకమైన అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజకీయ రంగంలో ప్రవేశించిన వారికి పదవులు దక్కే అవకాశం ఉంది. కోర్టు కేసులు ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఊహించని లాభాలు, లాటరీ విజయాలు కూడా సంభవించవచ్చు. పెళ్లి సంబంధాలు ఆశించిన విధంగా కుదిరే అవకాశముంది.
రాశుల వారీగా ప్రభావం:
మేష, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు: అనుకోని లాభాలు, కొత్త వ్యాపారాలు, గౌరవం పెరుగుతుంది.
వృషభ, సింహ, మకర రాశులు: ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశీ అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి.
మిథున, కన్య, ధనుస్సు రాశులు: కుటుంబ సమస్యలు పరిష్కారం, పెళ్లి సంబంధాలు, ఆస్తి లాభాలు.
తుల, కుంభ రాశులు: రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎదుగుదల, కోర్టు కేసుల్లో విజయం.
పండితుల అభిప్రాయం ప్రకారం, గజకేసరి రాజయోగం కేవలం వ్యక్తిగత రాశులకు మాత్రమే కాదు, సమాజానికీ శుభప్రదమై ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు పండుతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. 64 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అరుదైన ఖగోళ సంయోగం అనేది, అనేక మందికి జీవితంలో ఒక కొత్త పుటను తెరవబోతోందని విశ్వసిస్తున్నారు. అదృష్టాన్ని పట్టుకునే వారు ముందడుగు వేస్తే భవిష్యత్తు బగారం అవుతుందని పండితులు అంటున్నారు. (గమనిక: ఈ కథనం పండితుల అభిప్రాయం ప్రకారం రాసినది.. దీనిని ధృవీకరించడం లేదు)
