ఏప్రిల్ 8న రెండు పాన్ ఇండియా అప్డేట్స్

టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ తో దేశవ్యాప్తంగా తన ఐడెంటిటిని ఎస్టాబ్లిష్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వారి కొత్త సినిమాలకి సంబందించిన ఎలాంటి అప్డేట్ వచ్చిన కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అలాగే ఆయా సినిమాల అప్డేట్ వస్తుంది అంటే అది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోతుంది. మన హీరోల మార్కెట్ రేంజ్ ఆ స్థాయిలో ఉందని చెప్పాలి. ఈ నేపధ్యంలో స్టార్ హీరోల చిత్రాల నుంచి చిన్న అప్డేట్స్ ని కూడా చాలా గ్రాండ్ గా చిత్ర నిర్మాతలు ప్రాజెక్ట్ చేస్తున్నారు.

సినిమాకి ఎంత హైప్ పెరిగితే నిర్మాతగా తనకి అంత లాభం అని సదరు ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. అదే సమయంలో దర్శకులు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీలు కరెక్ట్ గా అర్ధం చేసుకొని యూజర్ పల్స్ ని పట్టుకొని సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇలా హైప్ ఉన్న సినిమాలలో చూసుకుంటే అల్లు అర్జున్ పుష్ప 2, ఆదిపురుష్ ఉన్నాయని చెప్పాలి. ఈ రెండు సినిమాలకి సంబందించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపధ్యంలో పుష్ప2 నుంచి త్వరలోనే సర్ప్రైజింగ్ గా ఓ చిన్న గ్లిమ్స్ ని రిలీజ్ చేసేందుకు సుకుమార్ రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆ మూవీ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తాజాగా కన్ఫర్మ్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీ గ్లిమ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 8న పుష్ప 2 మూవీ గ్లిమ్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా ఆదిపురుష్ మూవీ నుంచి అప్డేట్ కోరుకుంటున్నారు.

ఇక సినిమా అవుట్ పుట్ పై ఓం రౌత్ చాలా సంతృప్తికరంగా ఉన్నారని, టీజర్ రిలీజ్ తర్వాత ఏవైతే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయో వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అదిరిపోయే అప్డేట్ ని అందించడానికి సిద్ధం అయ్యారని తెలుస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ 8న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హై వోల్టేజ్ లో ఉంటే ఈ సాంగ్ తో సినిమాపై హైప్ ని అమాంతం పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం.