ఎన్టీఅర్ కోసం బాలీవుడ్ నుంచి ఆ ఇద్దరు

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కాబోతుంది. ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక దీనిపై ఎన్టీఆర్ భారీగా హోప్స్ పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో సమయం ఎక్కువ అయిన పక్కాగా ఉండాలని ఫుల్ ప్లాన్ తో సెట్స్ పైకి వెళ్తున్నారు.

ఇక ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ మూవీ సెట్ వర్క్ ప్రస్తుతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ క్యాస్టింగ్ సెలక్షన్ ప్రస్తుతం జరుగుతుంది. దీని కోసం బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించుతున్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ మూవీలో తారక్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించడానికి ఒకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇక అతనికి కొరటాల కథ కూడా చెప్పడం జరిగిందని సమాచారం. క్యారెక్టర్ చాలా మాసివ్ గా ఉండటంతో సైఫ్ ఒప్పుకున్నాడు అని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం జాన్వీ కపూర్ ని సంప్రదిస్తున్నట్లుగా టాక్ వినిపించింది.

ఇక జాన్వీ కూడా తెలుగులో గ్రాండ్ ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఇంతలో వేరొక హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యిందనే మాట వినిపిస్తుంది. ఇక ఈ నెల ఆఖరున జరగబోయే మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంటుంది అని తెలుస్తుంది. ఆ రోజే క్యాస్టింగ్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికి కొరటాల సిద్ధం అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.