Raj Tarun : కన్ఫ్యూజన్ లో సూరిగాడు…ఇప్పటికైనా రూటు మార్చేనా…!

 

Raj Tarun : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఉయ్యాలా జంపాలా సినిమాతో రంగ ప్రవేశం చేసి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన హీరో రాజ్ తరుణ్. కుమారి 21 ఎఫ్ సినిమా తో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. రాజ్ తరుణ్ పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం అవుతున్నా ‘ఉయ్యాల జంపాల’, ‘కుమారి 21ఎఫ్’, సినిమాలు తప్ప ఇక ఏ సినిమాలు అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల వచ్చిన అనుభవించు రాజా సినిమా కూడా ఈ కోవలోనే కలిసిపోయింది.

దీంతో రాజ్ తరుణ్ తన పద్ధతి మార్చుకొని స్టాండ్ అప్ రాహుల్ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నీ మూటకట్టుకుంది. అయితే రాజ్ తరుణ్ ఏ సినిమా తీసినా అభిమానులు ఆకట్టుకోలేక పోతుండటంతో సినిమా ఎంపిక విషయంలో డైలమాలో ఉన్నాడట. తిరిగి ఫామ్ లో రావడానికి ఎలాంటి కథలను ఎంచుకోవాలి, అభిమానులకు తిరిగే ఎలా దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తున్నారట.

చలనచిత్ర పరిశ్రమ లో హీరోగా నిలదొక్కుకోవాలంటే చాలా పట్టుదల, శ్రమ, కృషి ఉంటే కానీ సాధ్యపడదు. కొన్నిసార్లు ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పటికీ సినిమాలు చేస్తున్నా ఆదరణ తగ్గిపోతుంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ఉండాలి. అయితే రాజ్ తరుణ్ తరువాత ఎటువంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.