ఫుడ్ డెలివరీ గర్ల్ గా మారిన స్టార్ హీరోయిన్.. ఫోటో వైరల్?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది వారిలో రష్మిక మందన్న కూడా ఒకరు. సోలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని తన ఆనందం అభినయంతో స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. మొదట కన్నడ పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో స్టార్ హీరోల సరసన నటించి నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు నార్త్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తోంది.

ఇటీవల విడుదలైన పుష్ప సినిమా ద్వారా రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ అమ్మడు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించిన రష్మిక ఇటీవల ఫుడ్ డెలివరీ గర్ల్ గా అవతారం ఎత్తింది. ఇటీవల మెక్ డోనాల్డ్స్ సెలబ్రిటీ మీల్స్ లో భాగంగా రష్మిక డెలివరీ గర్ల్ గా మారి స్వయంగా స్కూటీలో కస్టమర్ ఇంటికి వెళ్లి ఫుడ్ డెలివరీ చేసింది.

అయితే ఫుడ్ పార్సెల్ అందుకున్న కస్టమర్స్ రష్మికని చుసి షాక్ అయ్యారు. వాళ్లకు ఫుడ్ డెలివరీ చేసింది నేషనల్ క్రష్ రష్మిక అని తెలిసి ఆ కస్టమర్స్ ఎంతో సంతోషించారు. అయితే స్వయంగా రష్మిక వారు ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ చేయటంతో వారు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఈ క్రమంలో కస్టమర్ రష్మికతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. అయితే జనవరిలో వచ్చిన ఈ యాడ్ కి సంబంధించిన వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక సినిమాల విషయాని వస్తే ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పుష్ప 2 లో నటిస్తోంది. ఇక హిందీ లో వరుణ్ ధావన్, రన్ భీర్ వంటి హీరోలతో నటిస్తోంది.