Sanjay Dutt: సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతున్నప్పుడు పాత్రలు కూడా మారిపోవడం సహజం. అదే సందర్భంలో నార్త్ స్టార్ హీరోలు సౌత్‌లో విలన్స్‌గా ఛాన్సులు అందుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టినవారి లిస్ట్‌లో సంజయ్ దత్ (Sanjay Dutt) ముందుంటారు. KGF 2లో అదిరిపోయే పెర్ఫార్మన్స్తో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సంజయ్, అప్పటి నుంచి సౌత్‌లో హాట్ ఫేవరెట్ అయ్యారు.
‘అఖండ-2’లో విలన్‌గా సంజయ్‌దత్ ?
KGF తర్వాత లియో, డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు అందుకున్నా, ఆ సినిమాలు ఆశించిన స్థాయి విజయాలు సాధించలేదు. అయినప్పటికీ, రాజా సాబ్ వంటి కొత్త ప్రాజెక్టుల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కానీ ఇప్పుడు అతనికి నిజమైన పోటీదారుడు వచ్చేశాడు. అతనే బాబీ డియోల్ (Bobby Deol). యానిమల్ చిత్రంలో తన విలన్ పాత్రతో బాబీ డియోల్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
Bobby Deol
దాంతో, అతనికి సౌత్‌లో భారీగా ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న బాబీ, కోలీవుడ్‌లో కంగువా చిత్రంలోనూ నటించాడు. అలాగే విజయ్ 69వ ప్రాజెక్టులో కూడా అతనికి అవకాశం దక్కింది. ఇప్పుడు మరో తెలుగు చిత్రం కోసం చర్చలు సాగుతున్నాయట. సౌత్‌లో బాబీ డియోల్ (Bobby Deol) ఇంత ఫాస్ట్‌గా స్థానం సంపాదించడానికి మరో కారణం రెమ్యునరేషన్ ప్లాన్.
సంజయ్ దత్ (Sanjay Dutt)తో పోలిస్తే, బాబీ (Bobby Deol) తన రెమ్యునరేషన్‌ను ప్రాజెక్ట్‌కు తగ్గట్టుగా డిస్కౌంట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడట. సంజయ్ దత్ 8 నుంచి 9 కోట్ల రేంజ్ లో అందుకుంటే బాబీ 5 కోట్ల రేంజ్ లో వెళుతున్నాడట. ఈ నెంబర్ నిర్మాతల మరింత ఆకర్షిస్తోంది. అంతేకాదు, బాబీ ప్రాజెక్ట్‌కి అంకితభావంతో పనిచేయడం, పాత్రలను లోతుగా అర్థం చేసుకోవడం కూడా అతనికి ప్లస్ పాయింట్స్‌గా మారాయి.