స్టార్ హీరో విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ మరో గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా అవుట్ లుక్ ఇండియా నిర్వహించిన బిజినెస్ అవార్డ్స్ 2024లో ఐకాన్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ గా రౌడీ వేర్ బ్రాండ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేశారు. రౌడీ వేర్ ని ఐకాన్ బ్రాండ్ గా మార్చిన రౌడీ ఫ్యాన్స్ తోపాటు తన రౌడీ టీం కి కూడా విజయ్ దేవరకొండ థాంక్స్ చెప్పారు. అలాగే సక్సెస్ఫుల్గా రౌడీ వేర్ ని ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు.
ఈ అవార్డు తీసుకోవడానికి విజయ్ దేవరకొండ తరఫున ఆనంద్ దేవరకొండ అవార్డు ప్రధానోత్సవం లో పాల్గొన్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాలు విషయానికి వస్తే రెండు సంవత్సరాల కిందట వచ్చిన లైగర్ రిజల్ట్ విజయ్ దేవరకొండకు మామూలు షాక్ ఇవ్వలేదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలనుకున్న విజయ్ కల కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.
ఫ్యామిలీ స్టార్ అయితే మళ్లీ పెద్ద డిసార్డర్ ని మిగిల్చింది. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్నూరితో ఒక భారీ సినిమాను పట్టాలెక్కించాడు ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.ఇక విజయ్ దేవరకొండ సినిమాలంతో కన్నా ఎక్కువగా రష్మిక తో టైం స్పెండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యనే వీళ్లిద్దరూ హోటల్లో ఫుడ్ తీసుకుంటూ సోషల్ మీడియా కంటపడి తెగ వైరల్ అయ్యారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ తాను సింగిల్ కాదని కమిటెడ్ అని చెప్పటం, మొన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో రష్మిక మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం మీకు తెలుసు కదా మళ్లీ అడుగుతారు ఏంటి అంటూ విజయ్ దేవరకొండ గురించి చెప్పకనే చెప్పటం చూస్తుంటే త్వరలోనే వీళ్ళిద్దరి దగ్గర నుంచి గుడ్ న్యూస్ వినిపించేలా ఉంది అంటున్నారు నెటిజన్స్.