Allu Arjun: పుష్ప2 కి అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

Allu Arjun: గత వారం రెండు వారాలుగా సోషల్ మీడియాలో ఎక్కువగా మారుమోగుతున్న పేరు పుష్పరాజ్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతుండడంతో గత రెండు వారాలుగా అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.

అలాగే ఫ్యాన్స్ లో ఆనందాన్ని అలాగే అంచనాలను మరింత రెట్టింపు చేయడం కోసం మూవీ మేకర్స్ కూడా బ్యాక్ టు అప్డేట్స్ ని విడుదల చేస్తూ మరింత సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ఇండియా 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్‌ 10 నటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్‌ రూ.300 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం అనే చెప్పాలి. పుష్ప2 కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకున్నట్లు తన కథనంలో పేర్కొంది.

తమిళ కథానాయకుడు విజయ్‌ ఇటీవల వచ్చిన ది గ్రేటెస్ట్‌ ఆఫ్ ఆల్‌టైమ్‌, లియో చిత్రాలతో పాటు, రాబోయే విజయ్‌69 మూవీ కోసం రూ.275 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నారట. ఇలా విజయ్ రెండవ స్థానంలో ఉండగా మూడవ స్థానంలో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఉన్నారు. డంకీ మూవీ కోసం ఆయన రూ.150-250 కోట్ల పారితోషికం అందుకున్నారట. ఆ తర్వాత స్థానంలో రజనీకాంత్,అమీర్ ఖాన్,ప్రభాస్,అజిత్, సల్మాన్ ఖాన్,కమల్ హాసన్,అక్షయ్ కుమార్ లు ఉన్నారు. ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న వారిలో అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారన్న మాట. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఇది కదా పుష్పరాజ్ అంటే తగ్గేదేలే అంటూ కామెంట్లు చేస్తున్నారు.