Chaitanya-Shobitha: టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న ఈ జంట వివాహం గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. నాగచైతన్య మొదట సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసుకోబోతుండడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
ఆ సంగతి పక్కన పెడితే చైతన్య,శోబిత ఇద్దరు సీక్రెట్‌గా లవ్ ట్రాక్‌ని నడిపించిన విషయం తెలిసిందే. అయితే ఎంత రహస్యంగా ఉన్నా, విదేశాల్లో మాత్రం దొరికిపోయారు. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. అంతేకాదు వీరు కూడా పంచుకోగా, నెటిజన్లు పట్టేశారు. రూమర్లు స్టార్ట్ అయ్యాయి. అయినా దీనిపై స్పందించలేదు. ఏం తెలియనట్టుగానే వ్యవహరించారు. కానీ సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరిని సర్ప్రైజ్ చేశారు. తమ సీక్రెట్ డేటింగ్‌ని అఫీషియల్ చేసేశారు. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ పెళ్లికి తమిళం, తెలుగు, హిందీ, కన్నడ ఇలా పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో పెళ్లి అనేది వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా నటులు, నటీమణుల పెళ్లి అంటే దాన్ని చూడటానికి అభిమానులు ఆసక్తి చూపుతారని గ్రహించి, దాన్ని వ్యాపారంగా మార్చి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇటీవలే నయనతార పెళ్లి వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీగా విడుదలైంది. అయితే ఇప్పుడు విషయంలో నాగచైతన్య నయనతార ని ఫాలో అవుతున్నారు.. కాగా నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల జంట వివాహాన్ని ప్రసారం చేసే హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తుంది. అది కూడా రూ.50 కోట్లు ఇచ్చి వీరి పెళ్లిని ప్రసారం చేసే హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. దీంతో నాగ చైతన్య – శోభిత జంట వివాహంలో కూడా కఠిన ఆంక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు 50 కోట్ల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.