తెలుగు చిత్ర సీమలో డైరెక్టర్ సుకుమార్ ఒక ప్రత్యేకమైన పంథాలో సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలని కొలత వేసినట్లుగా ఇమిడ్చి సినిమాని వైవిధ్యంగా మలచడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవాలి. మంచి కథతో పాటు కధానాయకుడి పాత్రతో అభిమానులకి కొత్త అనుభూతిని కలిగేలా చేస్తారు. అంతేకాకుండా ఆయన సినిమాలో మాస్ ప్రేక్షకులని అలరించటానికి తప్పకుండా ఒక ఐటెం సాంగ్ ని ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.

మొదటి సినిమా ఆర్యలో ‘అ… అంటే అమలాపురం’ సాంగ్ నుండి మొన్న వచ్చిన రంగస్థలంలో ‘జిగేలు రాణి’ సాంగ్ వరకు ఐటెం సాంగ్స్ తో మాస్ ఆడియన్స్ ని పిచ్చెక్కించారు. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న ప్రయోగాత్మక సినిమా ‘పుష్ప’ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఏ చిన్న పాయింట్ కూడా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయకూడదని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన రెగ్యులర్ పంథాలోనే ‘పుష్ప’ కోసం ఒక మాస్ మసాలా సాంగ్ ని కూడా సిద్ధం చేయబోతున్నారట. ఈ పాట కోసం బాలీవుడ్ సుందరి దిశా పటానిని సంప్రదించగా ఆమె భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ అడిగిందట. అయనప్పటికీ సుకుమార్ ఒప్పుకున్నారని సమాచారం. ఈ మాస్ సాంగ్ ని అదిరిపోయేలా ట్యూన్ చేయటంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిమగ్నమయ్యారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా ఆడిపాడనుంది.