ఇన్సైడ్ టాక్ : ఈ సెన్సేషనల్ దర్శకుడితో ప్రభాస్ సినిమా.?

ఇపుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఇప్పుడు ఆల్రెడీ పలు భారీ సినిమాలు ఉన్నాయి. మరి వీటిలో కొన్ని షూటింగ్ స్టార్ట్ చేసుకున్నవి అలాగే స్టార్ట్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రాల్లో లైనప్ కి ప్రభాస్ ఓ సెన్సేషనల్ దర్శకుడు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది.

అది కూడా ఈ సమాచారం మొదట కోలీవుడ్ వర్గాల నుంచి బయటకి రావడం విశేషం. మరి మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే ఇపుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర తన సినిమాలతో క్రేజీ ట్రీట్ ఇచ్చిన ఈ దర్శకుడు లోకేష్ కనగ రాజు ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ లు చాలా ఉన్నట్టుగా సమాచారం ఇప్పుడు బయటకి వచ్చింది.

దీనితో ఈ సెన్సేషనల్ కలయిక కానున్నట్టుగా ఇన్సైడ్ టాక్. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాదు కానీ ఈ టాక్ అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో మంచి ఆసక్తిగా మారింది. దీనితో దీనిపై అధికారిక అప్డేట్ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇంకా లోకేష్ అయితే నెక్స్ట్ దళపతి విజయ్ తో సినిమా అనౌన్స్ చేయనున్నాడు. అలాగే నెక్స్ట్ “ఖైదీ 2” అలాగే “విక్రమ్ 2” చిత్రాలు చేయనున్నాడు.