ప్రభాస్ దారుణమైన లుక్..అసలు నిజం తెలుసుకోండి.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. వరుసగా పలు భారీ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి తాను చేస్తుండగా ప్రభాస్ ఇంత క్రేజ్ తెచ్చుకోవడానికి తన నటన పక్కన పెడితే మెయిన్ గా తన లుక్స్ గాని తన పర్సనాలిటీ గాని చాలా ప్లస్ అయ్యింది.

అయితే బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ నుంచి అయితే తన లుక్స్ లో ఆ చార్మ్ మిస్సవ్వడం ఫ్యాన్స్ ని మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. సినిమాలో అందంగా కనిపించే ప్రభాస్ తన వయసుతో పాటుగా ముఖంలో చాలా మార్పులు రావడంతో తన పాత రోజులు పోయాయి.

ఇక ఇప్పుడు తాను నటించిన లేటెస్ట్ భారీ చిత్రం ఆదిపురుష్ కోసం సిద్ధం చేసిన లుక్ లో ఆ మధ్య కొన్ని ఫోటోలు బయటకి రాగ అందులో ప్రభాస్ ని చూసి అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి కొన్ని షాకింగ్ ఫొటోస్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.

అయితే ఈ ఫొటోస్ లో ప్రభాస్ సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసినట్టుగా ఉంది. అయితే ఆదిపురుష్ ప్రభాస్ ఉన్న లుక్ లోనే తాను కనిపిస్తూ దారుణంగా ఈ ఫోటోలు ఉన్నాయి. అయితే దీనితో ఈ ఫోటోలు సినీ వర్గాల్లో వైరల్ కాగా వాటిని చాలా మంది కూడా నమ్మేశారు. కానీ అసలు ఈ ఫొటోస్ వెనుక అసలు నిజం అవి నిజమైన ప్రబస్ ఫోటోలు కాదట.

ఎవరో వేరే వ్యక్తికి ప్రభాస్ వి కొన్ని అన్ సీన్ ఫొటోస్ ని పెట్టి సర్క్యులేట్ చేయడంతో అవి నిజం అనుకున్నారు చాలా మంది. కానీ అసలు ఆ ఫొటోలో ఉన్నది ప్రభాస్ అయితే కాదని కొన్ని బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. మరి ఇలా ఓ హీరోని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తే అస్సలు వారికి ఏమొస్తుందో కూడా వారికే తెలీదు. 

Original
https://twitter.com/Sam_Smi82/status/1636004690700951554?s=20

Fake