ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌, ఉత్తమ నటిగా శ్రీలీల!

ప్రతిష్టాత్మక సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023 వేడుకలు దుబాయ్‌ లో ఘనంగా జరిగాయి. దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు.. ఉత్తమ నటన కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు గౌరవంగా ఈ అవార్డ్స్‌ ఇస్తుంటారు.

తాజాగా ఈ అవార్డ్స్‌ వేడుక 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్‌ 15న మొదటి రోజు తెలుగు, కన్నడ లకు సంబంధించిన అవార్డ్స్‌ వేడుక పూర్తయ్యింది. సెప్టెంబర్‌ 16న తమిళ్‌, మలయాళం ఇండస్ట్రీలోని సినిమాలు జరుగుతాయి. ఈవేడుకలలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అవార్డ్‌ అందుకున్నారు ఎన్టీఆర్‌.

అలాగే ‘ధమాకా’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డ్‌ సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌, అడివి శేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, నిఖిల్‌, సిద్ధూ జొన్నలగడ్డ, రామ్‌ చరణ్‌ పోటీ పడ్డారు. ఇందులో తారక్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డ్‌ అందుకున్నారు. ఇక ఉత్తమ నటి కేటగిరిలో మృణాల్‌ ఠాకూర్‌, మీనాక్షి చౌదరి, సమంత, నిత్యామీనన్‌, నేహాశెట్టి, శ్రీలీల పోటీ పడగా.. ‘ధమాకా’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డ్‌ అందుకుంది శ్రీలీల. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి అవార్డ్‌ అందుకోగా.. బెస్ట్‌ సింగర్‌ గా రామ్‌ మిర్యాల (డీజే టిల్లు చిత్రానికి) అవార్డ్‌ అందుకున్నారు. సౌత్‌ నుంచి పలువురు సినీ సెలెబ్రేటీస్‌ ఈ ఈవెంట్‌ లో పాల్గొన్నారు. గ్లోబల్‌ స్టార్‌ ఎన్టీఆర్‌, రానా, శ్రీలీల, శృతి హాసన్‌, మీనాక్షి చౌదరి లాంటి టాప్‌ సెలెబ్రేటీస్‌ సైమా ఈవెంట్‌ లో పాల్గొని ఎంతగానో సందడి చేశారు.ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్‌ వేడుకలో చాలా మంది స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్లు అవార్డులను గెలుచుకున్నారు.

ఉత్తమ నటుడు ఎవరు, నటి ఎవరు, ఉత్తమ దర్శకుడు ఎవరు.. ఇలా పలు విభాగాల్లో విజేతలు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.అయితే ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి దక్కబోతోంది అనే విషయం పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..ఉత్తమ నటుడి విభాగంలో అడివి శేష్‌- మేజర్‌, దుల్కర్‌ సల్మాన్‌.. సీతారామన్‌, నిఖిల్‌ .. కార్తికేయ2 , సిద్ధూ జొన్నలగడ్డ .. డీజే టిల్లు చిత్రాల నుంచి పోటీ పడగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఎన్టీఆర్‌, రాంచరణ్‌ కూడా పోటీలో నిలిచారు. అయితే తుది విజేతగా గ్లోబల్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ నిలవడం జరిగింది.

దీనితో ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్‌ 2023 లో విజేతగా నిలిచాడు. ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్‌ మీడియాలో ఈ విషయాన్నీ ఎంతో వైరల్‌ చేస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత ఎన్టీఆర్‌ ఈ అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా యంగ్‌ బ్యూటీ శ్రీలీల ఈ అవార్డు ను కైవసం చేసుకున్నారు.

రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రంలో హీరోయిన్‌ గా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్‌ కు ఆమె ఈ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా సైమా అవార్డ్స్‌ 2023లో అవార్డ్స్‌ అందుకున్న విజేతల వివరాలు ఇలా వున్నాయి.సీతారామం సినిమాకు ఉత్తమ చిత్రం గా అవార్డు దక్కింది. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. అలాగే స్టార్‌ హీరో రానా కు ‘భీమ్లా నాయక్‌’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడుగా అవార్డు లభించింది.

అలాగే రీసెంట్‌ గా ఆస్కార్‌ అవార్డ్స్‌ అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత గా ‘ఆర్‌ఆర్‌ ఆర్‌’ చిత్రానికి గాను అవార్డ్స్‌ అందుకున్నారు.ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరి లో సెంథిల్‌ కుమార్‌ (RRR)అవార్డు అందుకున్నారు. అలాగేఉత్తమ పరిచయ నటి గా మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ సినిమాకు గాను అవార్డు అందుకుంది. అలాగే ఉత్తమ విలన్‌ గా సుహాస్‌ హిట్‌ 2 చిత్రానికి గాను అవార్డ్‌ అందుకున్నారు

2023 అవార్డ్స్‌ విజేతల వివరాలు..

ఉత్తమ చిత్రం: సీతారామం

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)

ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)

ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)

ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)

ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)

ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)

సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు సాంగ్‌)

ఉత్తమ టోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)

ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌: సింగర్‌ మంగ్లీ (జింతక్‌ సాంగ్‌)

ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌

ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)

ప్రామిసింగ్‌ న్యూకమ్‌ యాక్టర్‌: బెల్లంకొండ గణేష్‌