14 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న నాని.. ఓవర్ నైట్ స్టార్ కాలేదంటూ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అంచలంచలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ నేడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నటువంటి నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈయన అనంతరం హీరోగా అవకాశాలను అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చానని మొదటిసారిగా బాపు గారి దర్శకత్వంలో తెరకెక్కిన రాధాగోపాలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని ఈయన తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తాను నేర్చుకున్నానని నాని వెల్లడించారు. కెరియర్ మొదట్లో రేడియో జాకీగా పని చేశానని అలాగే పలు యాడ్స్ లో కూడా నటించానని తెలిపారు.అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలోనే అష్టా చమ్మ సినిమాకు హీరోగా నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.

ఇలా అష్టా చమ్మ సినిమా మంచి హిట్ కావడంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయని అయితే ఇప్పుడు తాను అనుభవిస్తున్న ఈ స్టార్ డమ్ ఓవర్ నైట్ లో రాలేదని.. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను.నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను అంటూ ఈ సందర్భంగా నాని తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తూ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.