Allu Arjun-Nani: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. అంతేకాకుండా ఈ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారని చెప్పాలి. పుష్ప 2 సినిమా బన్నీ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఇప్పుడు అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాగా అదే ఊపుతో ఇప్పుడు అల్లు అర్జున్ మరిన్ని సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే హీరో నాని విషయానికి వస్తే..
సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి ఎదిగిన నటుల్లో నాని కూడా ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి నాని టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోవడంతో పాటు ఇటీవల కాలంలో నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. ఇక నాని లేటెస్ట్ గా నటించిన హిట్ 3 సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే గతంలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఒక కథతో న్యాచురల్ స్టార్ నాని సినిమా తీశాడు. కట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు గ్యాంగ్ లీడర్. న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ కూడా ఒకటి. విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. కార్తికేయ విలన్ గా నటించాడు. రివేంజ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే హీరో నానికి మంచి పేరును తీసుకొచ్చింది. అయితే విక్రమ్ కె కుమార్ ఈ గ్యాంగ్ లీడర్ కథ ను ముందుగా అల్లు అర్జున్ కు చెప్పాడట. బన్నీకి కూడా ఈ కథ బాగా నచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ సెట్ అయినట్టేనని విక్రమ్ కే కుమార్ భావించారట. అయితే అప్పటికే చేతిలో ఉన్న సినిమాలో లేదా మరో కారణమో తెలియదు కానీ బన్నీ అనూహ్యంగా ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడట. దీంతో ఇదే కథను నానితో తెరకెక్కించాడు విక్రమ్ కే కుమార్. గ్యాంగ్ లీడర్ తర్వాత కూడా బన్నీకి రెండు మూడు కథలు చెప్పాడట ఈ డైరెక్టర్. కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదట.
Allu Arjun-Nani: బన్నీ రిజెక్ట్ చేసిన కథతో నాని మూవీ.. కట్ చేస్తే రిజెల్ట్ అలా!
