“దసరా” కి పార్ట్ 2 పై నాని సెన్సేషనల్ క్లారిటీ.!

ప్రస్తుతం ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా మొత్తం దగ్గర కూడా సీక్వెల్ చిత్రాలు ఊపందుకున్నాయి. అంతే కాకుండా చాలా వరకు భారీ సక్సెస్ లు కూడా అందుకుంటూ వస్తుండగా మరిన్ని చిత్రాలు ఇదే కోవలో వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “దసరా” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రంపై లేటెస్ట్ గా సినీ వర్గాల్లో కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది అన్నట్టు రూమర్స్ రాగా ఒక్కసారిగా నాని ఫ్యాన్స్ లో ఈ టాక్ వైరల్ గా మారిపోయింది. దీనితో నాని కూడా వెంటనే సెన్సేషనల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కేవలం ఒక్క భాగం మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు.

కాకపోతే ఈ ఒక్క సినిమాలో ఒకటి లేదా ఇంకా ఎక్కువ సినిమాల పవర్ ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం ఆసక్తిగా మారింది. దీనితో దసరా పై ఎలాంటి సీక్వెల్స్ లేవు కానీ సినిమా మాత్రం మామూలుగా ఉండదని తాను చెప్పేసాడు.

ఈ సినిమాలో నాని ఒక ఊహించని కొత్త నాటు గెటప్ లో కనిపిస్తూ ఉండగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళ ఫేమస్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రం వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లెవెల్లో ఈ మార్చ్ 30 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.