కృష్ణ అంత్యక్రియలకు దూరంగా ఉన్న నాగార్జున.. కారణం ఏమిటో?

టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఈయన అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున కాంటినెంటల్ ఆసుపత్రిలో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. కృష్ణ మరణం వార్త తెలియగానే సినీ లోకం మొత్తం కదిలి వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతల నుంచి మొదలుకొని హీరోల వరకు కూడా కృష్ణ పార్థివ దేహాన్ని చూసి ఆయనకు నివాళులు అర్పించారు. కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు సైతం హాజరయ్యారు.

వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు అందరూ కూడా కృష్ణ చివరి చూపు కోసం ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే కింగ్ నాగార్జున మాత్రం కృష్ణ చివరి చూపు కోసం రాలేదని తెలుస్తోంది.కృష్ణ గారు మరణించారని వార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా స్పందించినటువంటి నాగార్జున ఆయనని చూడటానికి మాత్రం రాలేదు. కృష్ణ కుటుంబంతో నాగర్జునకు ఎంతో మంచి అనుబంధం ఉంది ఆయనప్పటికీ కృష్ణ మరణించిన నాగార్జున మాత్రం హాజరు కాలేదు.

నాగార్జున కృష్ణ పార్థివ దేహాన్ని చూడటానికి రాకపోయినా ఆయన కుమారులు అఖిల్,నాగచైతన్య హాజరయ్యారు కానీ నాగార్జున మాత్రం హాజరు కాలేదు.ఈ విధంగా ఒక గొప్ప నటుడు మరణిస్తే నాగార్జున రాకపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. బహుశా ఈయన తన సినిమాలతో బిజీగా ఉండి ఇతర దేశాలకు వెళ్లారా అనుకుంటే ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమాలు చేయడం లేదు. అయినప్పటికీ ఈయన మాత్రం కృష్ణ చివరి చూపుకు రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కృష్ణను చూడటానికి నాగార్జున రాకపోవడానికి కారణం ఏంటో తెలియాలంటే నాగార్జున స్పందించాల్సిందే.