మోడల్ నుంచి బాలీవుడ్ స్టార్ గా ఎదిగిన హీర్ అచ్రా.. భారీగా ప్రముఖుల ఆఫర్స్!

Heer Achhra Amazing Looks

హీర్ అచ్రా మోడల్, నటి. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి.. తన నటన నైపుణ్యంతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందింది. మోడలింగ్ లో దూసుకుపోతూ సినిమా రంగంలోకి ప్రవేశించి నటనలోనూ తన సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముంబై అందాల తార హీర్ ఆచ్రా. భారీ అవకాశాలతో ఒకవైపు సినిమాలలోనూ, యాడ్స్ లోను బిజీగా ఉంటూ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాప్ సెలబ్రిటీగా ఆదరణ పొందింది.

ఇదేమి చిన్న విషయం కాదు. తన నటన నైపుణ్యంతో, ఎంతో హార్డ్ వర్క్ చేసి, నిరంతర కృషితో ప్రముఖ దర్శకుల నుండి వరుస ఆఫర్లను అందుకుంటుంది. సూర్యాంశ్, పటేల్‌ వర్సెస్‌ పెట్రిక్‌ వంటి సూపర్ హిట్ గుజరాతి చిత్రాలను తన ఖాతాలో వేసుకొని ప్రేక్షకుల హృదయాలను దోచుకొని, ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఏకంగా బాలీవుడ్ లోనే తనకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రముఖ యాక్టర్ టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ఒక యాడ్‌ షూట్‌ చేసింది.

దేశవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్‌ లైనటువంటి సన్ సిల్క్, నివియా, మియా జ్యువెలరీ తదితర బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌ డా, యాడ్‌ మోడల్‌గా పనిచేయడం విశేషం. నటన, మోడలింగ్‌ అంశాల్లో తన ప్రయాణానికి టెమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 2018 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ బిరుదును పొందింది. అంతేకాదు.., ఎఫ్‌బీబీ ఫెమీనాతో పాటు మిస్‌ గుజరాతీ ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించుకుంది. హీర్‌ అచ్రా చేయబోయే యాడ్స్, మోడలింగ్‌ తదితర వ్యవహారాలను ముంబైకి చెందిన ప్రముఖ ఏజెన్సీ ‘‘రన్ వే లైఫ్‌స్టైల్‌’’ పర్యవేక్షిస్తుంది.