ఇండస్ట్రీ టాక్ : రామ్ చరణ్ రెండో హిందీ సినిమా ఓకే చేశాడా?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మంచి క్రేజ్ ఉన్నటువంటి తెలుగు హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. తన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో నార్త్ ఆడియెన్స్ లో బాగానే క్రేజ్ తెచ్చుకున్న చరణ్ ఇక నెక్స్ట్ మరో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉండగా చరణ్ తెలుగు, తమిళ్ దర్శకులతో ఎక్కువ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఎప్పుడో చరణ్ తన బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. కాగా ఆ సినిమానే “తూఫాన్”. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి అయితే చరణ్ హిందీలో రెండో సినిమా ఓకే చేసాడు అంటూ కొన్ని రూమర్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయాయి.

అయితే ఈసారి మాత్రం భారీ ప్లాన్ నే చరణ్ చేసాడని అంటున్నారు. ఈసారి చరణ్ బాలీవుడ్ బిగ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి కనిపిస్తాడని అంటున్నారు. హిందీలో రీసెంట్ గానే వచ్చిన రూమర్ ధూమ్ 4 చిత్రంలో చరణ్ కూడా ఉంటాడని ఇప్పుడు అంటున్నారు. అంతే కాకుండా దీనిపై ఈ జనవరిలోనే ఓ క్లారిటీ వస్తుంది అని కూడా అంటున్నారు.

ఇది కానీ నిజం అయితే ఆ హైప్ ఇంకో లెవెల్ లో ఉంటుంది అని ఇప్పుడు అయితే చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ దీనిపై ఓ క్లారిటీ ఇస్తారని బాలీవుడ్ వర్గాలు నుంచే రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ అవి ఎంతవరకు నిజం అనేవి మాత్రం తెలియాల్సి ఉంది.