గాసిప్స్ : పెళ్లి పీటలెక్కబోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్? 

టాలీవుడ్ సినిమాలో పరిచయం అయ్యిన కొన్నాళ్లలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న వారు చాలా తక్కువమంది ఉంటే అందులో నిలదొక్కుకొని కొనసాగే వారు ఇంకా తక్కువమంది ఉంటారు. అయితే వారిలో కొన్నాళ్ళు స్టార్ హీరోయిన్ గా ఉండి తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ లో గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకామె.

కాగా రకుల్ ఇప్పుడు తెలుగులో నటించడం తగ్గించేసింది. ఇప్పుడు అంతా హిందీలోనే వర్క్ చేస్తుంది కానీ అక్కడ కూడా ఆమెకి పెద్దగా సక్సెస్ రేట్ లేదు. ఇక ఫైనల్ గా అయితే ఈమె పెళ్లి పీటలెక్కబోతుంది అని బాలీవుడ్ సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఓ బిజినెస్ మేన్ తో డేటింగ్ లో ఉండగా వారిద్దరూ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది.

అలాగే వీరిదేమి లవ్ మ్యారేజ్ అయితే కాదని డెస్టినేషన్ గానే ఫిక్స్ కాగా అక్కడ నుంచి ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. అలా రీసెంట్ గా కొన్ని పిక్స్ కూడా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఐతే ఇదిలా ఉండగా రకుల్ పెళ్లి డేట్ పై కూడా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటితో రానున్న ఫిబ్రవరి 22న అలా లేదా ఫిబ్రవరి ఎండింగ్ లో పెళ్లి చేసుకోనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

మరి వీటిపై అయ్యితే అధికారిక అప్డేట్ కోసం బాలీవుడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. కాగా ఇపుడు రకుల్ ప్రీత్ సింగ్ తమిళ నాట రెండు భారీ చిత్రాలు చేస్తుంది. ఒకటి దర్శకుడు శంకర్ తో ఇండియన్ 2, మరొకటి హీరో శివ కార్తికేయన్ తో అయలాన్ సినిమాల్లో నటించింది. వీటిలో అయలాన్ ఈ సంక్రాంతి కానుకగా రాబోతుంది.