బాలీవుడ్ నెం1 డైరెక్టర్ తో చరణ్ మూవీ పై బిగ్ క్లారిటీ..!

ఇప్పుడు చాలా వరకు ఇండియన్ సినిమా దగ్గర స్టార్ దర్శకులు మరియు హీరోలు కూడా ఇతర ఇండస్ట్రీ హీరోస్ దర్శకులతో కలిసి వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో తెలుగు దర్శకులు హిందీ హీరోస్ తో వర్క్ చేస్తున్నారు కానీ హిందీ దర్శకులు ఇంకా తెలుగు హీరోస్ తో చేయాల్సి ఉంది.

కాగా ఈ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ “వార్ 2” లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. అయితే తారక్ తో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బాలీవుడ్ దర్శకులతో మంతనాలు చేసున్నాడు అని ఆ మధ్య అంతా కొన్ని పుకార్లు షికార్లు చేసాయి.

కాగా ఈ లిస్ట్ లో అయితే బాలీవుడ్ నెంబర్ 1 దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేస్తాడని కూడా బజ్ వచ్చింది. ఇది కానీ ఓకే అయ్యి ఉంటే ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ ఫేమస్ అండ్ నెంబర్ 1 దర్శకులతో వర్క్ చేసే హీరోగా చరణ్ నిలిచేవాడు. అయితే అసలు తమ కాంబినేషన్ పై రాజ్ కుమార్ హిరానీ బిగ్ క్లారిటీ అందించారు.

తమ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాం అని వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. అలాగే చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేస్తానని చెప్పడం ఇక్కడ గమనార్హం. మరి మొత్తానికి అయితే ప్రస్తుతం వున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు అనేది క్లారిటీ వస్తే ఫ్యూచర్ లో సినిమా చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు అని చెప్పడం ఆసక్తిగా మారింది.

మరి చూడాలి ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ పడుతుందో లేదో అనేది. ఇక హిరానీ తెరకెక్కించిన “డన్కి” చిత్రం మంచి వసూళ్లు అందుకొని షారుఖ్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.