షాకింగ్ : కేవలం 32 ఏళ్లకే బాలీవుడ్ ప్రముఖ నటి కన్నుమూత 

ఇప్పుడు ఒక ఊహించని వార్త అయితే సోషల్ మీడియాలో మరియు మెయిన్ గా బాలీవుడ్ సినీ వర్గాల్లో ఊహించని విధంగా మారింది. కాగా బాలీవుడ్ సినిమాకి చెందిన కొందరు హాట్ బ్యూటీ లలో అప్పట్లో నిరంతరం వార్తల్లో నిలిచే సెన్సేషనల్ హాట్ బాంబ్ పూనమ్ పాండే అంటే చాలా మందికే తెలిసి ఉండొచ్చు.

పలు సమయాల్లో క్రికెట్ జరుగుతున్నపుడు కూడా కొన్ని బోల్డ్ ఛాలెంజ్ లు చేసి హాట్ టాపిక్ గా ఆమె నిలిచేది. కానీ ఇపుడు ఆకస్మికంగా ఆమె మరణ వార్త ఒక్కసారిగా బాలీవుడ్ వర్గాలని దిగ్బ్రాంతికి లోను చేసింది. అది కూడా కేవలం 32 ఏళ్లకే ఆమె కన్ను మూయడం మరింత విషాదకరం.

అయితే అసలు ఆమె ఎందుకు ఇంత చిన్న వయసులోనే చనిపోవాల్సి వచ్చిందంటే ఆమె గర్భాశయంలో వచ్చిన సర్వైకల్ కాన్సర్ మూలాన ఆమె కన్ను మూసినట్టుగా సోషల్ మీడియా ద్వారా ఆమె మేనేజర్ స్వయంగా ఆమె అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు.

దీనితో ఈ ఊహించని ఘటన ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఆమె ఎన్ని కాంట్రవర్సీ లు చేసినప్పటికీ కూడా ఈ రకంగా ఆమె కన్ను మూయడం అనేది మాత్రం చాలా మందిని ఎందుకో కలచి వేసింది. దీనితో సోషల్ మీడియాలో ఆమె ఆత్మకి శాంతి చేరాలని కోరుకుంటున్నారు.

అలాగే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పూనమ్ మరణ వార్తతో షాక్ అయ్యారు. కాగా పూనమ్ పాండే 2013లో సినిమా కెరీర్ ని స్టార్ట్ చేయగా ఇప్పుడు వరకు 8 చిత్రాల్లో నటించింది. అలాగే తెలుగులో మాలిని అండ్ కో అనే చిత్రంలో కూడా ఆమె నటించగా మరో నాలు టెలివిజన్ షోస్ లో కూడా కనిపించింది.