“సలార్” కి మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్స్!

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా నుంచి వచ్చిన భారీ ఏక్షన్ చిత్రాల్లో అయితే కన్నడ నుంచి వచ్చిన సినిమా “కేజీఎఫ్ 2” సినిమానే ఉంటుంది అని చెప్పాలి దర్శకుడు ప్రశాంత్ నీల్ నే స్పెషల్ గా మెన్షన్ చేసిన ఈ సినిమాకి అందుకే ఇండియన్ ఆడియెన్స్ ఆ రేంజ్ వసూళ్లు ఇచ్చారు.

ఇక మన తెలుగులో కూడా ఈ సినిమా 100 కోట్లకి పైగా గ్రాస్ కొల్లగొట్టి డబ్బింగ్ సినిమాల్లో సెన్సేషనల్ రికార్డు సెట్ చేసి పెట్టింది. కాగా ఇక ఈ దర్శకుడు నుంచి ఇదే భారీ ఏక్షన్ తో కూడిన సినిమా సినిమా అనుకుంటే దీనికి మించి పదింతలు ఉండేలా ఉంటుందని అని “సలార్” పై భారీ హైప్ ని అయితే నెలకొల్పాడు ప్రశాంత్ నీల్.

మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సాలిడ్ సినిమాపై సినీ వర్గాల నుంచి సెన్సేషనల్ టాక్ బయటకి వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ కాబోతుంది అట.

అంటే ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లలో ఉన్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. మరి ఇది ఒకేసారి ఉంటుందా లేక ముందు ఇండియా లో రిలీజ్ అయ్యాక ఉంటుందా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ సుకుమారన్ అలాగే జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.