క్రేజీ : “సలార్” కి ఓవర్సీస్ లో కళ్ళు చెదిరే డీల్.!

పాన్ ఇండియా సెన్సేషనల్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న మాసివ్ చిత్రాల్లో మొదటగా అయితే భారీ చిత్రం ఆదిపురుష్ రిలీజ్ తో సిద్ధం అవుతుండగా ఈ సినిమా పోస్టర్ కూడా రీసెంట్ గా వచ్చింది. అయితే మొదట్లో పెట్టుకున్నంత అంచనాలు ఇప్పుడు ఈ సినిమాపై అయితే ఫ్యాన్స్ లో లేవు.

కానీ దీని నెక్స్ట్ రిలీస్ గా ఉన్న సెన్సేషనల్ మాస్ ప్రాజెక్ట్ “సలార్” కోసం ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా అయితే ఉన్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు కేవలం పోస్టర్స్ మాత్రమే రాగా ఈ సినిమాకి మాసివ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పుడు సలార్ కి ఓవర్సీస్ మార్కెట్ లో కళ్ళు చెదిరే డీల్ ఇప్పుడు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే సలార్ కి ఏకంగా 70 కోట్లకి పైగా బిజినెస్ డీల్ లాక్ అయ్యినట్టు తెలుస్తుంది. దీనితో ఈ సినిమాకి టార్గెట్ 9 మిలియన్ కి పైగా వసూలు చేస్తే తప్ప లాభాల్లోకి సలార్ వెళ్ళదు అని చెప్పాలి.

అయితే ఇంకా టీజర్ కూడా రాని సినిమాకి ఈ రేంజ్ డిమాండ్ అంటే అసలు సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో అయితే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా హోంబేలె ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.