వైరల్ : ఆ షాకింగ్ వార్తలపై కోటా ఎమోషనల్ వీడియో.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్న ఎందరో దిగ్గజ నటుల్లో గత ఆరు నెలల వ్యవధి లోనే ఎంతో మందిని మనం కోల్పోయాము. ఒక్క నటులు మాత్రమే కాకుండా దర్శకులు గాయని లను కూడా మనం కోల్పోయాము. అయితే మళ్ళీ తాజాగా మరో షాకింగ్ వార్త అయితే దిగ్గజ నటులు కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు అంటూ పలు సంచలన వార్తలు అయితే వైరల్ గా మారాయి.

దీనితో ఎంత దౌర్భాగ్యం అంటే తాను బ్రతికే ఉన్నాను అంటూ తానే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మీడియాలో రిలీజ్ చేసిన వీడియో లో మొదటగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని అలాగే ఈ ఉదయం నా పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బయటకి వచ్చాయని తెలిసింది.

ఈ పండుగతో ఇలాంటి వార్తలు ఏంటా అని చాలా బాధ పడ్డాను అని ఈ వార్తలతో చాలా మంది ఫోన్ లు చేసేసారు ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పోలీసులు వాన్ లతో ఇంటికి వచ్చేసారు అని వాపోయారు. ఇదేంటి అని అడిగితే మీకు సెక్యూరిటీ కోసం వచ్చామని వార్తలు ఇలా వచ్చాయని.

అందుకే మీరు ఒక క్లారిటీ అందరికీ ఇవ్వాలని వారు తెలిపారని కోటా తెలిపారు. దీనితో తాను బతికే ఉన్నానని అలాంటి వార్తలు నమ్మవద్దని ఈ పండుగ నాడు ఇలాంటి వీడియో చేస్తున్నందుకు బాధగా ఉందని ఆయన తెలిపారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.