ఇండస్ట్రీ టాక్ : కాజల్ టాలీవుడ్ రీఎంట్రీ ఈ స్టార్ తోనే.?

kajal1

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో భారీ స్టార్డం ఉన్న వారిలో గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. మరి టాలీవుడ్ లో ఓ టైం లో నెంబర్ 1 హీరోయిన్ గా మారిన కాజల్ ఇప్పటికీ తన స్టార్డం ని అలాగే నిలుపుకుంది. అయితే తర్వాత సినిమాలు బాగా తగ్గించిన ఈమె ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ని అయితే లీడ్ చేస్తుంది.

మరి మళ్ళీ కాజల్ ని తెలుగు సినిమా దగ్గర ఎప్పుడు చూస్తాం అనుకుని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కాజల్ అయితే మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తుంది.

కాజల్ రీ ఎంట్రీ టాలీవుడ్ నుంచి ఓ అగ్ర హీరోతోనే ఉంటుందట. మరి అది కూడా మరెవరో కూడా మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ తోనే అన్నట్టు తెలుస్తుంది. బాలయ్య నెక్స్ట్ చేస్తున్న చిత్రం దర్శకుడు అనీల్ రావిపూడితో 108వ సినిమా కోసం గాను కాజల్ పేరు పరిశీలనకు వచ్చిందట.

అలాగే దాదాపు ఆమె ఈ సినిమాతోనే టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వినికిడి. ఇక దీనిపై త్వరలోనే క్లారిటీ రావచ్చని కూడా తెలుస్తుంది. మరి ఆల్రెడీ ఈ సినిమాలో శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుందని రూమర్స్ ఉన్నాయి. వీటిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా తన గత చిత్రం వీరసింహా రెడ్డి కి కూడా థమన్ నే సంగీతం ఇచ్చాడు.