జాన్వీకపూర్ కెరీర్‌లో ఎక్కువగా సక్సెస్‌లు లేకపోయినా? కథాంశాల ఎంపికలో ఆమె అభిరుచి బాగుంటుందని చెబుతారు. ఐదేళ్ల కెరీర్‌లో వినూత్న చిత్రాల్లో భాగమైందీభామ.జూ. ఎన్ఠీఆర్ ‘దేవర’ చిత్రంతో ఆమె తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కొన్ని మాసాల క్రితం విడుదల చేసిన జాన్వీకపూర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచింది.
తాజా సమాచారం ప్రకారం కథాగమనంలో జాన్వీకపూర్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, రెండు భిన్న పార్శ్వాలు కలిగిన క్యారెక్టర్‌లో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు. సినిమా ద్వితీయార్థంలో జాన్వీకపూర్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని, ఆమె అలా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశం కథలో కీలకంగా ఉంటుందని అంటున్నారు.
తన క్యారెక్టర్‌లోని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ నచ్చడం వల్లే జాన్వీకపూర్ ఈ సినిమాకు అంగీకరించిందని, దక్షిణాదిలో తన కెరీర్‌కు శుభారంభాన్నిచ్చే చిత్రమవుతుందనే ధీమాతో ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే గోవాలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త్వరలో కర్ణాటకలో కొత్త షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.