సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న ‘గుంటూరు కారం’. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానుంది. దాంతో మహేష్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రానుంది. ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. మహేష్ ఈ సినిమాలో మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుందని తెలుస్తోంది.
నిజానికి ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ జరుపుకోవాలి..కానీ అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఈ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈసినిమా తో మహేష్ బాబు మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమా కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ బాబు దాదాపు 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్!!?
