వాల్తేరు వీరయ్య కోసం రవితేజ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మాస్ మహారాజ రవితేజ కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇందులో రవితేజ ఏసీపీ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్రనిడివి సుమారు 45 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఇలా రవితేజ పాత్ర కూడా ఈ సినిమాలో కీలకం కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం రవితేజ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే రవితేజ వాల్తేరు వీరయ్య సినిమా కోసం ఏకంగా మైత్రి మూవీ మేకర్స్ వారి నుంచి 17 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

ఇలా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం మాత్రమే కాకుండా ఈ సినిమా కోసం రవితేజ భారీగా పారితోషికం అందుకోవడం.గతంలో రవితేజ హీరో కాకముందు చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో చిరంజీవికి తమ్ముడు పాత్రలో నటించారు. ఇలా చాలా కాలం తర్వాత మరోసారి చిరంజీవి సినిమాలో రవితేజ సందడి చేయనున్నారు.ఇక రవితేజ కూడా తాజాగా ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.