ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో సెన్సేషనల్ హైప్ లో ఉన్న చిత్రాల్లో ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. పైగా ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో కూడా అన్ని సినిమాలకి మించి హైప్ ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా “సలార్” సినిమానే అని చెప్పుకోవాలి.
కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా అప్పట్లో కేవలం అనౌన్సమెంట్ తోనే 100 కోట్ల ఓటిటి హక్కుల ఆఫర్స్ సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. కాగా ఈ సినిమాలో అయితే ప్రభాస్ పక్కన గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఈమె ఈ సినిమాలో ఆద్య అనే పాత్ర చేస్తుండగా ఆమె పోర్షన్ ని కంప్లీట్ చేసేసినట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీని బట్టి అయితే షూటింగ్ విషయంలో చిత్ర యూనిట్ అసలు ఏ రేంజ్ స్పీడ్ తో ఉన్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక మిగిలింది ప్రభాస్ పోర్షన్ మాత్రమే కావచ్చు.
ఇది కూడా బహుశా మార్చ్ లేదా ఏప్రిల్ నాటికి కంప్లీట్ చేసి ఇక సినిమాలో గ్రాఫిక్స్ పనులు స్టార్ట్ చేయనున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్. మొత్తానికి అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్న రోజుల్లో ఉండబోతున్నాయి అనేది క్లియర్. కాగా ఈ సినిమాకి కూడా ఆల్ మోస్ట్ కేజీఎఫ్ యూనిట్ నే వర్క్ చేయగా హోంబలె ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
It's a wrap for Aadya, @shrutihaasan ♥️#Salaar #Prabhas #PrashanthNeel #VijayKiragandur @hombalefilms @PrithviOfficial @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @anbariv @shivakumarart @SalaarTheSaga pic.twitter.com/7OuVleZ02F
— Salaar (@SalaarTheSaga) February 23, 2023
