టాలీవుడ్ హీరోస్ మొట్ట మొదటిగా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ను చూసిన హీరో గాని అలాగే తెలుగు హీరో నుంచి హాలీవుడ్ లెవెల్ సినిమాగా అనౌన్స్ చేసింది గాని ఎవరన్నా ఉన్నారు అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. మరి ప్రభాస్ హీరోగా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో పాటుగా చేసిన పాన్ వరల్డ్ సినిమానే “ప్రాజెక్ట్ కే”.
దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా చాలా యూనిక్ పాయింట్ తో తెరకెక్కుతూ ఉండగా వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ మరియు ఇండియా నుంచి కూడా ఎందరో టాలెంటెడ్ వ్యక్తులని ఈ సినిమాకి పట్టుకొని చిత్ర యూనిట్ చేస్తున్నారు. మరి షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ అయిపోవస్తుంది.
కాగా ఇప్పుడు కొన్ని షాకింగ్ గాసిప్స్ సినిమాపై వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ అంటూ అసలు సంక్రాంతి బరిలో గేట్ ఓపెన్ చేసిందే ఈ సినిమా. కానీ ఇప్పుడు ఈ రేస్ నుంచి ఈ సినిమానే మొదట తప్పుకోనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తేలాల్సి ఉంది కానీ కొన్ని ట్రస్టడ్ వర్గాలే ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ చెప్తున్నారు. దీనితో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి మరోసారి డిజప్పాయింట్మెంట్ తప్పదని అనుకోవాలి. అయితే ఇదే సంక్రాంతి రేస్ లో మహేష్ సినిమా కూడా అనౌన్స్ అయ్యింది. అలాగే చరణ్ శంకర్ సినిమా కూడా అప్పటికే వస్తుందనీ టాక్. దీనితో ఇంత పెద్ద పోటీలో ఎందుకు అని పెద్ద మనసుతో ముందే ప్రభాస్ సినిమా మేకర్స్ తప్పుకున్నారా ఏమో తెలియాల్సి ఉంది.