సినిమా హిట్ అవడంతో ఆ హీరోలకు డైమండ్స్ గిఫ్ట్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్?

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయిన, ప్లాప్ అయినా ఆ ప్రభావం పడేది నిర్మాతల మీదే. ఎంత ఖర్చు చేసి సినిమాలు నిర్మించినప్పుడు ఆ సినిమాలు ప్లాప్ అయితే నిర్మాతలు అప్పుల నుండి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. అయితే అలాంటి సమయాలలో కొందరు హీరో, హీరోయిన్స్ వారు తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయటం లేదా రెమ్యునరేషన్ తగ్గించటం వంటివి చేస్తూ నిర్మాతలకు కొంత ఊరటం ఇస్తున్నారు. అలా కాకుండా సినిమా హిట్ అయితే మాత్రం నిర్మాత సంతోషం పట్టరానిది. సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చినప్పుడు నిర్మాతలు ఆ సంతోషాన్ని సినిమా యూనిట్ తో కలిసి సంబరాలు చేసుకోవటమే కాకుండా ఆ సినిమాలో నటించిన నటీనటులకు కూడా ఖరీదైన బహుమతులు ఇస్తూ ఉంటారు.

ఇటీవల తమిళంలో హీరో కార్తీ నటించిన విరుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో ఆ సినిమా యూనిట్ సంబరాలు జరుపుకుంది. ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహించగా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో సూర్య ఈ సినిమా ని నిర్మించాడు. గ్రామీణ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవటంతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు చిత్రయూనిట్‌కు ఖరీదైన బహుమతులు అందించారు.

ఈ క్రమంలో సినిమా వల్ల మంచి లాభం రావటంతో తమిళనాడు డిస్ట్రిబ్యూటర్‌ శక్తివేలన్‌ హీరో సూర్య కార్తీ లతో పాటు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో కి విరుమన్‌ సహనిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌కు ఖరీదైన బహుమతులు అందజేశారు. ఈ క్రమంలో సూర్య, కార్తీ లకు డైమండ్‌ బ్రాస్‌లేట్స్‌ బహుమతి గా అందించగా.. ముత్తయ్యకు ఖరీదైన వజ్రపు ఉంగరాన్ని కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది