ఆ బయోపిక్ సినిమా కోసం మహేష్ బాబును సంప్రదించారా..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు రావడం సర్వసాధారణం. ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తల బయోపిక్ చిత్రాలను చేస్తుంటారు. ఈ క్రమంలోనే లేడీ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలోఎయిర్ డెక్కర్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ రాసిన పుస్తకం ఆధారంగా ఆకాశమే నీ హద్దురా అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా తమిళంలో సురారై పొట్రూ పేరుతో విడుదలై ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు జాతీయస్థాయి అవార్డులు వరించాయి.

ఇలాంటి అద్భుతమైన బయోపిక్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సుధా కొంగర ప్రస్తుతం భారతీయ ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా బయోపిక్ చిత్రాన్ని చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేయగా ఈ సినిమాలో రతన్ టాటా పాత్రలో నటించడం కోసం అన్వేషణ జరుగుతుంది.అయితే రతన్ టాటా బయోపిక్ సినిమాలో నటించడం కోసం ముందుగా మహేష్ బాబుని సంప్రదించారట.

మహేష్ బాబు ఇప్పటివరకు ఎలాంటి బయోపిక్ చిత్రాలలో నటించలేదు అయితే రతన్ టాటా బయోపిక్ అనగానే ఈయన కూడా కాస్త ఆసక్తి చూపినప్పటికీ తన కాల్ షీట్స్ లేకపోవటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.ఇక మహేష్ బాబు ఈ సినిమాకి కుదరదని చెప్పడంతో సూర్య అలాగే బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ బయోపిక్ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం.