‘గుంటూరు కారం’తో క్రికెటర్‌ అశ్విన్‌ ఫిదా!

మహేష్ బాబు నటించిన సరికొత్త చిత్రం ‘గుంటూరు కారం’పై భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రశంసల వర్షం కురిపించారు . ఇదొక వినోదాత్మక చిత్రమన్నారు. తనకెంతో నచ్చిందన్నారు. ప్రధాన నటీనటుల డ్యాన్స్‌ చూసి ఆశ్చర్యపోయానన్నారు. మహేశ్‌ నటించిన ;గుంటూరుకారం’ చూడకపోతే చూడండి. ఎంటర్‌టైనింగ్‌ మూవీ. శ్రీలీల డ్యాన్స్‌ అదరగొట్టేసింది. మహేష్ బాబు మంచి డ్యాన్సర్‌. ఆయనతో కలిసి శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది అని ఓ ఇంటర్వ్యూలో అశ్విన్‌ చెప్పారు.

మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రమిది. తల్లి సెంటిమెంట్‌తో యాక్షన్‌ డ్రామాగా దీనిని తీర్చిదిద్దారు. శ్రీలీల, విూనాక్షి చౌదరి కథానాయికలు. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, జయరాం, మురళీ శర్మ, రావు రమేశ్‌ కీలకపాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనలు సొంతం చేసుకుంది. ‘కుర్చీమడతపెట్టి’ పాటలో మహేష్ బాబు ` శ్రీలీల డ్యాన్స్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. నెట్‌ప్లిక్స్‌ వేదికగా ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది.