కొత్త లుక్స్‌లో మహేష్ బాబు… రాజమౌళి సినిమా కోసమేనా అంటూ కామెంట్స్‌!

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో స్టార్‌ హీరో మహేష్ బాబు ఒకరు. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవలే ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం తదుపరి సినిమా షూట్‌ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టయిలిష్ లుక్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసిన ఫ్యాన్స్‌ రాజమౌళి సినిమా కోసమేనా ఈ లుక్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. దీంతో ఎస్‌ఎస్‌ఎంబి 29 హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ లోకి వచ్చింది.

మరోవైపు మహేష్ `రాజమౌళి ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో వార్త కూడా షేర్‌ అవుతోంది. దీనికి రాజమౌళి తండ్రి విజయేందప్రసాద్‌ కథను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘నాకు, రాజమౌళికి దక్షిణాఫ్రికా రచయిత విల్బర్‌ స్మిత్‌ నవలలు చాలా ఇష్టం. ఆయన రాసిన చాలా పుస్తకాలు చదివాం. వాటి ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని సన్నివేశాలు రాశాం’ అని అన్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. యాక్షన్‌ మూవీ కావడంతో ఈ సినిమాకు ఎక్కువ రోజులు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు.

సినిమా కథకు తగినవిధంగా పాత్రలు, వాటి స్కెచ్‌లను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కథా నేపథ్యానికి సంబంధించిన సెట్స్‌ డిజైన్‌ పైనా కసరత్తు చేస్తున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాలో మహేష్ ఎనిమిది లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి స్కెచ్‌లు పూర్తయ్యాయని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘గుంటూరు కారం’చిత్రంతో అలరించిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

అలాగే మహేష్‌పై ఫొటో షూట్‌ కూడా జరిగింది. త్వరలో షూటింగ్‌ మొదలవుతుందని ఇటీవల మహేష్ ఓ వేదికపై వెల్లడించారు. చిత్రీకరణ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తాజాగా మహేష్‌ లేటెస్ట్‌ ఫోటోలు సోషల్‌ మీ డియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.. ట్రెండీ లుక్‌లో మహేష్‌ ఆకట్టుకుంటు న్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్‌ వర్కౌట్స్‌ చేస్తున్నారు. అలాగే రాజమౌళి స్క్రిప్ట్‌ ఫైనల్ చేయడంతోపాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు. ఆర్టిస్టులను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు.. ఇక రెండు మూడు నెలల్లో షూటింగ్‌ పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి.