పొడవాటి జుట్టు..గడ్డంతో మహేశ్‌ బాబు.. టీమ్‌తో దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చిన జక్కన్న!

పొడవాటి జుట్టు, గడ్డంతో.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు లేటెస్ట్‌ లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్‌ బాబు చేస్తున్న సినిమా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళితో ఉండబోతోన్న విషయం తెలిసిందే. ‘ఎంబి29’గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన టీమ్‌.. తిరిగి హైదరాబాద్‌ చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోలో మహేష్‌ బాబు లుక్‌ వైరలవుతోంది.

పొడవాటి జుట్టు, గడ్డంతో.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు లేటెస్ట్‌ లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహేష్‌ బాబు చేస్తున్న సినిమా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళితో ఉండబోతోన్న విషయం తెలిసిందే. ఎస్‌ఎస్‌ ఎంబిగా గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి టీమ్‌ కసరత్తులు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను టీమ్‌ వేగవంతం చేసింది.

ఈ ప్రీ ప్రొడక్షన్‌ పనుల నిమిత్తం రీసెంట్‌గా టీమ్‌ దుబాయ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పనులను ముగించుకుని ప్రస్తుతం టీమ్‌ అంతా హైదరాబాద్‌ వచ్చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో మహేష్‌ బాబుని చూసిన వారంతా.. ‘ఏమున్నాడ్రా బాబు’ అని, మరీ ముఖ్యంగా మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అయితే పండగ చేసుకుంటున్నారు.

అంతేకాదు.. మహేష్‌ బాబు, రాజమౌళి ఈ వీడియోలో పక్కపక్కనే కనిపించడంతో.. త్వరలోనే సినిమాకు సంబంధించిన గుడ్‌ న్యూస్‌ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. మహేష్‌ బాబు లుక్‌ టెస్ట్‌ నిమిత్తమే.. టీమ్‌ దుబాయ్‌ వెళ్లినట్లుగా ఈ మధ్య వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు మూడు టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఓపెనింగ్‌ ఎప్పుడవుతుందా? అని అంతా వేచి చూస్తున్నారు. అతిత్వరలోనే.. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది.