ప్రైవేట్‌ ఫంక్షన్‌లో స్టెప్పులేసిన దర్శకధీరుడు రాజమౌళి!

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాను పాన్‌ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే, జక్కన్నలో మరో టాలెంట్‌ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇటీవలే జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది కూడా తన భార్య రమా రాజమౌళితో కలిసి స్టేజ్‌పై సందడి చేశారు. ‘ప్రేమికుడు’ సినిమాలోని ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన ‘అందమైన ప్రేమరాణి..’ అంటూ సాగే హిట్‌ పాటకు అదిరేలా స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకన్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ డ్యాన్స్‌ వీడియో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. జక్కన్న డ్యాన్స్‌ వీడియో చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ‘విూలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి హిట్‌ సినిమాల తరువాత మహేశ్‌తో ‘ఎంబి29’ తో బిజీగా మారాడు. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను పూర్తిచేసుకుంటోంది. రాజమౌళి ప్రతి సినిమాకు తన భార్య రమానే కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అన్న విషయం తెలిసిందే.