క్యూరియాసిటీ పెంచేస్తున్న ‘కుబేర’

ధనుష్‌,నాగార్జున కాంబినేషన్‌లో స్పెషాలిటీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకక్కుతోన్న చిత్రం ‘కుబేర’ ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్‌ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ ఇచ్చారు. సినిమా నుంచి కింగ్‌ నాగార్జున ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయడమే కాకుండా సినిమా థీమ్‌ను వివరించేలా వీడియోను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల చేశారు.

వీడియోలో.. భారీ వర్షం పడుతుండగా నిండా డబ్బులతో ఉన్న కంటైనర్ల మధ్య నాగార్జున గొడుగుతో నిల్చుని కింద పడి ఉన్న రూ.500 నోట్లను కంటైనర్‌లో పెట్టడాన్ని చూయిస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఈ ‘కుబేర’ సినిమా షూటింగ్‌ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా ఈ సంవత్సరం దసరాకు గానీ దీపావళికి గానీ విడుదల చేయనున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కర్‌ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తుండగా, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.