రాజమౌళి బాహుబలితో ఆ సినిమాని పోలుస్తున్నారా… మరి దారుణం?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాతోనే తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు జక్కన్న. ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి తదితరులు నటించి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా పెద్ద ఎత్తున మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా అనంతరం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో వచ్చే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది.

ఇలా బాహుబలి రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా ఇంతవరకు రాలేదనేది వాస్తవం. అయితే తాజాగా కోలీవుడ్ మీడియా మాత్రం మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, జయం రవి, కార్తీ వంటి హీరోలు నటించిన పొన్నియిన్ సెల్వం. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమాని ఫాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది.

ఈ క్రమంలోని కోలీవుడ్ మీడియా ఈ సినిమాను ఏకంగా రాజమౌళి బాహుబలి సినిమాతో పోలుస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన ప్రభాస్ అభిమానులు ఈ సినిమాతో బాహుబలి సినిమాకి పోలిక ఏంటి అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అసలు ఈ సినిమాకు జక్కన్న తరువాత తీసిన సినిమాలు కూడా సాటి రావని భావిస్తున్న తరుణంలో ఏకంగా బాహుబలి సినిమాతో ఈ సినిమాను పోల్చి చూడడం చాలా విడ్డూరంగా ఉందని అభిమానులు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలయ్యి ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.