Big Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

Big Boss 6: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అన్ని భాషలలో సీజన్లను పూర్తిచేసుకొని ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. అయితే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున పనులు ప్రారంభించారని త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.

ఇక ప్రతి ఏడాది బిగ్ బాస్ ప్రారంభమయ్యే సమయంలోనే ఈ సీజన్ కూడా ప్రారంభం అవుతుందని సమాచారం. అంటే అక్టోబర్ నెలలో ఈ కార్యక్రమం ప్రసారం కానుందనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయం గురించి నిర్వాహకులు అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం ఓటీటీ
లో కాకుండా బుల్లితెరపై ప్రసారం కానుంది.ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గతంలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు నాగార్జున ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. ఇదివరకు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా ఉంటారని బలంగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయాలపై నిర్వాహకులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.