టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక శోభిత అలాగే నాగచైతన్య ఎప్పుడెప్పుడు ఒక్కటి అవుతారా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా శోభిత మరో రెండు రోజుల్లో ఆమె బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నారు.
వీరి వివాహం బుధవారం అనగా డిసెంబర్ 4న జరగనున్న విషయం తెలిసిందే. కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పెళ్లి వేడుకలు ఇరు కుటుంబాల్లో ప్రారంభమయ్యాయి. ఇటీవలే కాబోయే వధువు వరులకు మంగళ స్నానాలు కూడా చేయించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శోభిత పెళ్లి కుమార్తెగా ముస్తాబు అయ్యింది. పెళ్లికూతురుగా ముస్తాబు అయినా శోభితకు హారతులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభితను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పెళ్లి కావడంతో శోభిత ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న నాగచైతన్య శోభితలో ఒకటి కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అ సమయం కోసం అటు ఇటు కుటుంబాలతో సన్నిహితులు బంధువులు అలాగే అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా శోభిత ఎప్పటికప్పుడు తన పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.