నా సాంగ్ వల్లే ఆ సినిమా హిట్.. స్త్రీ 2 పై వైరల్ కామెంట్స్ చేసిన తమన్నా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా అందరికీ సుపరిచితమే. మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ జైలర్ సినిమాలో రజనీకాంత్ తో నువ్వు కావాలయ్యా అంటూ చేసిన ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే స్త్రీ 2 సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేసి మెప్పించింది.ఈ సినిమా విడుదలై భారీ హిట్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా స్త్రీ 2 సక్సెస్ కి కారణం తన పాటే అని చెప్పింది. 2018 లో వచ్చిన స్త్రీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దాని తరువాత వచ్చిన స్త్రీ 2 ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇందులోనే తమన్నా ఆజ్ కి రాత్ అంటూ చేసిన ఐటెం సాంగ్ ఒక రేంజ్ లో హిట్ అయింది.

ఈ సాంగ్ కలో తమన్నా డాన్స్ ఇరగదీసింది. అయితే ఈ సాంగ్ పై తమన్నా చేసిన కామెంట్స్ కి మూవీ టీం ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి అలాగే మరొక సందర్భంలో తమన్నా మాట్లాడుతూ అసలు స్త్రీ 2 లో ఐటమ్ సాంగ్ చేయటానికి భయపడ్డానని చెప్పింది.అందుకు కారణం జైలర్ సినిమాలో తను చేసిన పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఆ స్థాయిలో ఈ సాంగ్ హిట్ అవుతుందో లేదో అని భయపడ్డాను అదే విషయం స్త్రీ 2 డైరెక్టర్ కి చెప్పాను. సినిమా హిట్ కాకపోతే మీకే రిస్క్ అని కూడా చెప్పాను. కానీ స్త్రీ 2 డైరెక్టర్ కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ నమ్మకం చూసి నేను కూడా ఈ ఐటెం సాంగ్ చేయటానికి ఒప్పుకున్నాను అని చెప్పింది తమన్నా.