హైదరాబాదులో పుష్ప 2 ఈవెంట్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా!

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా గ్రాండ్ రిలీజ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద ప్రమోషన్ ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉన్నారు పుష్ప మూవీ టీం. ఇప్పటివరకు చెన్నై, కొచ్చి, ముంబై, పాట్నాలలో ఈవెంట్ షోలు చేసిన ఈ టీం తెలుగువారి కోసం ఇప్పుడు హైదరాబాదులోఈవెంట్ చేయటానికి ప్లాన్ చేసింది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ని ఎక్కడ నిర్వహిస్తారు అనేది కాస్త సందేహం గా అనిపించింది అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలకి ఎండ్ కార్డు పడింది. గతంలో దేవర విషయంలో గందరగోళం జరిగిన దృష్ట్యా పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ కి అనుమతి ఇస్తారా అనేది డౌట్ గానే ఉండేది అయితే ఈ సినిమా ఈవెంట్ డిసెంబర్ 2 న హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోతుంది. పటిష్ట భద్రత మధ్య ఈ కార్యక్రమం జరగబోతుంది.

హైదరాబాదులో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ తెలుగు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈవెంట్ సోమవారం సాయంత్రం 6:00 కి ప్రారంభం కాబోతుంది. ఈవెంట్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లెవెల్ లో చేస్తున్నారు. యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ చాలా పెద్దది కాబట్టి ఎక్కువ జనాలు రావచ్చు అన్న ఉద్దేశంతోనే ఈవెంట్ ని అక్కడ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈవెంట్ కి పుష్ప 2 చిత్ర బృందం మొత్తం వస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా ఈవెంట్ ని ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలలో నిర్వహించారు కానీ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించలేదు. అందుకే హైదరాబాద్లో ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు అర్థరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు పడనున్నాయి, శనివారమే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఇక గెట్ రెడీ ఫర్ పుష్ప 2.