Adivi Shesh: ఇండియన్ సినిమా ప్రపంచంలో సౌత్ చిత్రాలు ప్రత్యేకమైన రికార్డును అందుకుంటున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతున్న సౌత్ సినిమాలు, బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేశాయి. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. అయితే, నార్త్ ఇండియాలో కొందరు మాత్రం సౌత్ సినిమాల విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా సౌత్ సినిమాలపై ఓ వివాదాస్పద కామెంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో ‘ది బ్యాడ్ డాక్టర్’ అనే యూజర్ సౌత్ సినిమాలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. “దక్షిణాది సినిమాలు ఫార్ములా ఏంటంటే, స్వచ్ఛత లేని హీరోలు ప్రేమ కోసం పది వేల మంది పై పోరాడుతారు. అంతా బలహీనమైన కథలే,” అంటూ కామెంట్ చేశాడు. ‘పుష్ప 2’పై ప్రస్తుతం ఉన్న హైప్ చూసి ఇలాంటి కామెంట్ చేసాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.
దీనిపై హీరో అడివి శేష్ తెలివైన కౌంటర్ ఇచ్చారు. “ఇలాంటి కామెంట్స్ చేసే బదులు, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో సౌత్ సినిమాలు ఎందుకు పెద్ద విజయాలు సాధిస్తున్నాయో ఆలోచించండి” అంటూ శేష్ వివేకంతో స్పందించారు. నెటిజన్లు కూడా ఈ ట్వీట్‌పై ఆగ్రహంతో స్పందిస్తూ, సౌత్ సినిమాల క్వాలిటీని ప్రశంసిస్తూ, నార్త్ సినిమాల సరసన వాటిని ఉంచి పోల్చాలని సూచించారు.
సౌత్ సినిమాల పట్ల పెరుగుతున్న గ్లోబల్ ఆదరణను చూసి కొందరు హేతుబద్ధంగా ప్రశంసిస్తుండగా, మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ సినిమాల విజయాల వెనుక ఉన్న కసరత్తు, కథా బలం, నిర్మాణ విలువలను గుర్తించకుండా ఇలాంటి విమర్శలు చేయడం తగదని సినీ విశ్లేషకులు అంటున్నారు. “సినిమా అనేది భాష లేదా ప్రాంతంతో పరిమితం కాదు. సౌత్ చిత్రాలు ఈ మాటను నిరూపించాయి” అంటూ శేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారాయి.